ADB: ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తుందని జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని పలు కాలనీలలోని ప్రజలను కలుస్తూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వారికి వివరించారు. ఈ సందర్భంగా సీపీఐ పార్టీ చేసిన పోరాటాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు.