BHPL: రేగొండ మండలంలో వేణుగోపాలస్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కీర్తిరెడ్డి, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు నిశిధర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆశీస్సులతో రేగొండ మండల ప్రజలు కలకాలం పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో సమృద్ధిగా ఉండాలని కీర్తిరెడ్డి ఆకాంక్షించారు.