ముల్లాన్‌పూర్ వేదికగా SRHతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ ప్లేయర్లు నల్ల రిబ్బన్లతో కనిపించారు. యూపీలో ఇటీవల పడవ ప్రమాదంలో చనిపోయిన వారికి నివాళిగా టీమ్ నల్ల బ్యాడ్జిలు ధరించినట్లు పంజాబ్ SMలో పోస్టు పెట్టింది. ఇటీవల యమునలో పంజాబ్‌కి చెందిన పది మంది భక్తులు ప్రమాదవశాత్తు మరణించిన విషయం తెలిసిందే. స్వల్ప గాయాలైన మరో 18 మందిని రెస్క్యూ బృందం రక్షించింది.