NLG: చిట్యాల మండలం వెలిమినేడులోని నోష్ ఫార్మాలో జరిగిన అగ్నిప్రమాదంపై ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ప్రమాద స్థలాన్ని సందర్శించిన ఆయన, యాజమాన్యాల నిర్లక్ష్యం వల్లే కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని మండిపడ్డారు. గాయపడిన వెంకటేశ్వర్లు, లక్ష్మణ్‌లకు మెరుగైన వైద్యం అందించి, ఆదుకోవాలని డిమాండ్ చేశారు.