ADB: ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలని భీంపూర్ ఎస్సై ప్రణయ్ తెలిపారు. శనివారం మండలంలోని గుంజాల గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామస్తులందరూ కలిసికట్టుగా ట్రాఫిక్ నిబంధనలపై తీర్మానాలు చేయడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మడావి వినోద్, MPO సుమీర్ ఖాన్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.