MBNR: మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా చెన్నంగారి నవకాంత్ నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదేళ్లుగా పార్టీలో క్రియాశీలకంగా ఉండటం, ఇటీవల భారీ మెజారిటీతో గెలవడం ఆయనకు ప్లస్‌గా మారింది. ఈ నేపథ్యంలో అధిష్ఠానం ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.