TG: MLC బల్మూర్ వెంకట్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. గోవాలోని ఒక ప్రైవేట్ రిసార్ట్లో ఇందుజ గడ్డంను ఆయన పెళ్లి చేసుకున్నారు. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహిత బంధువులు, అతి కొద్ది మంది రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. దీంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.