GDWL: మల్దకల్ మండలంలో గత మూడు నెలలుగా చిరుతపులి దాడులతో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం నేతువానిపల్లిలో చిరుత సంచారంపై నడిగడ్డ తెలంగాణ జాగృతి నాయకులు తిమ్మప్ప, తిమ్మప్ప నాయక్ ఫారెస్ట్ రేంజ్ అధికారి పర్వేజ్ అహ్మద్‌కు వినతిపత్రం అందజేశారు. అధికారులు వెంటనే స్పందించి చిరుతను బంధించాలని వారు డిమాండ్ చేశారు.