VKB: కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజలపై పడి గాయాలు చేస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ పట్టణంలోని ఎన్నెపల్లి సాయినగర్ కాలనీలో అదేవిధంగా పట్టణంలోని ప్రధాన వీధుల్లో కుక్కలు గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.