NZB: బోధన్ పట్టణంలోని 28వ వార్డులో కట్టపోచమ్మ ఆలయ పునఃనిర్మాణానికి నేడు పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భూమిపూజ చేశారు. ఆలయం శిథిలావస్థకు చేరడంతో ఆలయాన్ని నూతనంగా నిర్మించాలని పట్టణ అభివృద్ధి కమిటీ నిర్ణయించింది. కొన్ని నెలల కిందట 16వ వార్డులో పోచమ్మ ఆలయ నిర్మాణం చేపట్టారు. అదే తరహాలో వేయి కళ్ల పోచమ్మ ఆలయ నిర్మాణం చేస్తున్నరు.