లెజెండరీ గాయని ఆశా భోస్లే అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె హెల్త్‌పై అప్డేట్ వచ్చింది. ‘తీవ్రమైన అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్తో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరారు. దయచేసి మా ప్రైవసీకి విలువ ఇవ్వండి. చికిత్స కొనసాగుతోంది. అంత త్వరగా సెట్ అవుతుంది’ అని ఆమె మనవరాలు జానై భోస్లే సోషల్ మీడియాలో తెలిపింది.