నల్గొండ రూరల్ పోలీసులు VIPS గ్రూప్ పేరుతో సాగుతున్న భారీ పెట్టుబడి మోసాన్ని వెలుగులోకి తెచ్చి 10 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశారు. అధిక లాభాలు, క్యాష్‌బ్యాక్ ఆఫర్ల పేరుతో ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి తిరిగి చెల్లించకుండా మోసం చేసినట్లు గుర్తించారు.“WAVE” అనే కొత్త పేరుతో మోసం చేయాలని యత్నిస్తున్న సమయంలో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.