MDK: నిజాంపేట మండలం నందగోకుల గ్రామంలో SI రాజేష్ రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. ఈ గ్రామాన్ని ప్రత్యేకంగా ఎంపిక చేశామని, సోమవారం ఉన్నతాధికారులతో కలిసి గ్రామస్తులకు మరిన్ని విషయాలు వివరిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ పాటించి సురక్షితంగా ఉండాలని ఆయన కోరారు.