NLG: చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామ పంచాయతీలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాలకు విద్యను అందించడంలో పూలే కృషి మరువలేనిదని, సావిత్రిబాయి పూలేను ఉపాధ్యాయురాలిగా మలిచారని గుర్తు చేశారు.