TG: ఇంటర్ ఫలితాలను విద్యార్థులు తమ మొబైల్లోనే పొందే వెసులుబాటును ప్రభుత్వం తెచ్చింది. వాట్సాప్ నంబర్ 8096958096కు హాయ్ అని మెసేజ్ పంపాలి. BIE Exam Result అని టైప్ చేసి, ‘Open Service’ ఆప్షన్ నొక్కాలి. అక్కడ హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి, సంవత్సరం (1st/2nd Year), స్ట్రీమ్ (General/Vocational) ఎంచుకోవాలి. వివరాలు సమర్పించిన వెంటనే మీ ఫలితం ప్రత్యక్షమవుతుంది.