విక్కీ కౌశల్ హీరోగా ‘మడాక్ ఫిల్మ్స్’ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘మహావతార్’. ఈ క్రేజీ ప్రాజెక్టులో కథానాయికగా శ్రద్ధాకపూర్‌ను చిత్రబృందం సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ సెట్ అయితే విక్కీ, శ్రద్ధ కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే అవుతుంది. ఈ కొత్త జంట వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.