JGL: మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. జయంతి సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఫూలే చిత్రపటానికి నివాళులర్పించారు. కులవ్యవస్థ నిర్మూలన, మహిళా విద్యకు ఆయన చేసిన సేవలు ఆదర్శమని పేర్కొన్నారు.