TG: BJP ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యలకు మంత్రి వాకిటి శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. డీకే అరుణ రౌడీయిజం గురించి పాలమూరు జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు. మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కేటాయింపుపై తాను చర్చకు సిద్ధమని అరుణకు సవాల్ విసిరారు. ఒక బీసీ బిడ్డ మంత్రి అయినందుకు డీకే అరుణ ఓర్వలేకనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని శ్రీహరి మండిపడ్డారు.