MDCL: రామంతపూర్ పరిధి వెంకట్రెడ్డి నగర్లో పేదలకు ఆహార భద్రత కల్పించేందుకు ఇందిరమ్మ క్యాంటీన్ ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రూ.5కే టిఫిన్, మధ్యాహ్న భోజనం అందించే ఈ క్యాంటీన్ వల్ల కార్మికులు, నిరుపేదలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.