TG: ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు సీఎం రేవంత్ ఇవాళ ఉదయం 10 గంటలకు బయలుదేరనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొనే ఈ కీలక భేటీలో సీఎంతో పాటు మంత్రి దామోదర రాజనర్సింహ, సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్‌రెడ్డి కూడా పాల్గొననున్నారు. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.