BHNG: భూ భారతి రెవిన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులు, ఎస్సైఆర్, మీసేవ అప్లికేషన్స్ పెండింగ్, కోర్టు కేసులు, ధాన్యం కొనుగోలు, వీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మండల తహసీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం వీసీ హాల్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డితో కలిసి మండల తాహసీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.