WNP: మద్యం తాగి వాహనం నడిపిన ఇద్దరికీ ఐదు రోజులు జైలు శిక్ష పడినట్లు కొత్తకోట ఎస్సై శివానందం తెలిపారు. ఈనెల 28న కొత్తకోట బైపాస్‌లో పెద్దమందడి మండలానికి చెందిన పిడుగు రాముడు, పిడుగు అంజనేయులు వచ్చి తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి ఆత్మకూరు కోర్టులో హాజరపరచగా సెకండ్ క్లాస్ న్యాయవాది మహమ్మద్ ముక్తి యార్ జైలు శిక్ష విధించారు.