MDK: మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గాభవాని మాత ఆలయంలో శనివారం పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6 గంటలకు పల్లకి సేవను నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వీరేశం తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారిని పల్లకీలో ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో ఊరేగించనున్నారు. పల్లకీ సేవా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.