MBNR: 2025-26 విద్యా సంవత్సరానికి గాను స్కాలర్షిప్ గడువు మరోసారి పొడిగించినట్లు పాలమూరు యూనివర్సిటీ కళాశాల ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31లోపు గడువు పొడగించారని, ఇప్పటివరకు దరఖాస్తులు చేయని అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సందేహాలు ఉంటే కళాశాలలో సంప్రదించాలన్నారు.