BHNG: మాదాపూర్ గ్రామా శివారులో అక్రమంగా గంజాయిని కలిగి ఉన్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు, తుర్కపల్లి ఎస్సై ఎం. తఖియుద్దీన్ తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. మాదాపూర్ గ్రామ శివారులోని ఎల్లమ్మ గుడి దగ్గర అయిదుగురు అనుమనితులని అదుపులోకి తీసుకుని విచారించి కేసు నమోదు చేశారు. వారి వద్ద సుమారు 200 గ్రాముల గంజాయి స్వాధిన చేసుకున్నాట్లు తెలిపారు.