HNK: దామెర మండలం ఓగ్లాపూర్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏకశిల పాఠశాల బస్సు విద్యార్థులను తీసుకుని ఊరుగొండకు వెళ్తుండగా కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. స్కూల్ బస్సు డ్రైవర్‌కు కూడా గాయాలైయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 38 మంది ఉన్నట్లు సమాచారం.