TG: సైబర్ నేరాల నియంత్రణపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఫోరెన్సిక్, డేటా సెంటర్ల సంఖ్యను పెంచుకోవాలని.. విజిలెన్స్ విభాగంలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించాలని సూచించారు. అలాగే, సైబర్ క్రైమ్ నియంత్రణపై స్కిల్ యూనివర్సిటీలో ప్రత్యేక కోర్సును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దీనిపై తగిన అధ్యయనం జరగాలన్నారు.