KRNL: తుగ్గలి మండలం రామలింగాపల్లి గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. ఏంకోబు రావు (30) అనే వ్యక్తి ఈత కొట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. కాగా, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.