BHPL: మే 21 నుంచి జూన్ 1 వరకు సరస్వతి అంత్య పుష్కరాలు వైభవంగా జరగనున్నాయని దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్ తెలిపారు. కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి పుష్కరాలను ప్రారంభిస్తారు. భక్తులకు వసతి, నీరు, భద్రతతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రతిరోజూ సాంస్కృతిక కార్యక్రమాలు, సరస్వతి హారతి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.