కోనసీమ: మండపేట పట్టణంలో న్యూ కాలనీలో అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ దళిత నాయకులు బుధవారం రాత్రి నిరసన ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులపై జరిగిన దాడులు, అణచివేతకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం చేపట్టారు. మాజీ ఎంఎల్సీ అనంతబాబు చేతిలో దారుణ హత్యకు గురైన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం వర్ధంతిని పురస్కరించుకుని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.