TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రవాణాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఫ్యూచర్ సిటీ సమీపంలో రవాణా ప్రాజెక్టుల కోసం 500 ఎకరాలను కేటాయించింది. ఇందులో బుల్లెట్ ట్రైన్, హైస్పీడ్ రైల్ హబ్, భారీ బస్ డిపోలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే బహదూర్‌గూడలో 150 ఎకరాల్లో అత్యాధునిక టెర్మినల్ నిర్మించనున్నారు. ఈ భారీ ప్రాజెక్టులతో HYDలో అంతర్జాతీయ స్థాయి రవాణా కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది.