అనకాపల్లిలో ఉత్సాహం ఎప్పుడూ ప్రత్యేకమని జబర్దస్త్ ఫేమ్ ఆది అన్నారు. శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచార సమయంలో వచ్చిన అనుభవం మరపురానిదని తెలిపారు. అమ్మవారి జాతరకు మళ్లీ రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అభివృద్ధిలో ఆయన పాత్రను ప్రశంసించారు.