ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాష్ట్రపతి భవన్కు చేరింది. పరిశీలన, న్యాయ నిపుణులతో సంప్రదింపుల అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఈ బిల్లు చట్టరూపం దాల్చనుంది. కాగా, ఈనెల 2-3 తేదీల్లో అమరావతి బిల్లును పార్లమెంట్ ఆమోదించిన విషయం తెలిసిందే.