AP: రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభించడంతో ఆ ప్రాంత మహిళలంతా విజయవాడ దుర్గమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు, రైతులు కాలినడకన ఆలయానికి చేరుకుని పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, చీరను సారెగా సమర్పించుకున్నారు. అమ్మవారి దయ, కరుణతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అమరావతి సంపద సృష్టించే నగరంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.