AP: నెల్లూరు జిల్లా పొదలకూరు నిమ్మ మార్కెట్లో ధరలు ఆకాశాన్నంటాయి. 80 కిలోల నిమ్మ బస్తా రూ.10 వేలు పలికి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. పదేళ్లలో ఇంతటి ధర ఎప్పుడూ చూడలేదని రైతులు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కిలో నిమ్మకాయలు రూ.125 వరకు పలకడంతో రైతుల్లో సంతోషం వెల్లివిరిసింది. మార్కెటింగ్ శాఖ ద్వారా కిలో నిమ్మను రూ.8 చొప్పున కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారు.