MDK: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రరెడ్డి అన్నారు. చేగుంట మండల పరిషత్ కార్యాలయంలో కొనుగోలుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తూకం వేసిన ధాన్యం వెనువెంటనే రవాణా అయ్యేవిధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివప్రసాద్, ఎంపీడీవో చిన్నారెడ్డి పాల్గొన్నారు.