HYD: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా లేకుండా కేంద్రం కుట్ర చేస్తోందని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం విమర్శించారు. సికింద్రాబాద్ వైఎంసీఏలో నిన్న జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మతం మారినా దళితులపై అణచివేత కొనసాగుతోందని, వారికి రిజర్వేషన్లు దక్కాల్సిందేనని స్పష్టం చేశారు. కేంద్రం తీరును మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు తదితరులు తప్పుబట్టారు.