SRCL: వీర్నపల్లి మండలంలోని కంచర్ల గ్రామంలో పులి సంచరిస్తున్నందున రైతులు, ప్రజలు పొలాల వద్ద పనుల కోసం వెళ్లకూడదని ఎస్సై లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు. పొలాల దగ్గర పశువులను కట్టివేయకూడదని, పొలానికి వెళ్లేటప్పుడు ఇద్దరు లేదా ముగ్గురు కలిసి వెళ్ళాలని సూచించారు. ఇట్టి విషయాన్ని ప్రతీ గ్రామంలోని సర్పంచ్లు చాటింపు వేయించి ప్రజలకి తెలియజేయాలని ఎస్సై పేర్కొన్నారు.