SRCL: 22 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 93 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని సిరిసిల్ల ఆదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల బాధ్యులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.