WGL: నగరంలోని దుర్గేశ్వర స్వామి ఆలయంలో సోమవారం అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆలయ ఛైర్ పర్సన్ భర్తపై ధర్మకర్తలు పలు ఆరోపణలు చేస్తూ.. ఆలయ ఆస్తులను తమ అనుమతి లేకుండా లీజుకు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆలయ వ్యవహారాల్లో ఆయన పెత్తనం పెరుగుతోందని, తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని ధర్మకర్తలు డిమాండ్ చేశారు.