KDP: ఊటుకూరు సర్కిల్ వద్ద వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ A. వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో సీ.ఐ బాల మద్దిలేటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాహనదారులు హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.