BHNG: విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ కుమారి అన్నారు. ఆలేరు మండలం శారాజిపేట మండల ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ ‘బడిబాట’ కార్యక్రమం రెండో రోజు విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు పేద మరియు మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని తెలిపారు.