WGL: రాయపర్తి మండలం AK తండాలో యువతి మహేశ్వరి హత్య ఘటన కలకలం రేపింది. సామూహిక అత్యాచారం అనంతరం హత్య చేశారనే ఆరోపణలతో ప్రాంతంలో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కుటుంబాన్ని పరామర్శించారు. నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు.