ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమయింది. సీడబ్ల్యూసీ సమావేశానికి కాంగ్రెస్ సీఎంలు, పీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. ఈ నెల 16,17 తేదీల్లో ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశం అవుతున్న సందర్భంగా.. 2011 జనాభా లెక్కలు కాకుండా తాజా లెక్కలనే కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.