ADB: నేరడిగొండ మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో గురువారం PHC వైద్యులు కలిసి ఉచిత వైద్య శిభిరాన్ని నిర్వహించారు. విద్యార్థినులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. వేసవి కాలం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం వడదెబ్బపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డా.స్వప్న, హెచ్ఈఓ పవార్ రవీందర్, సంతోష్, రజిత ఉన్నారు.