ఏప్రిల్ వచ్చేసింది. వస్తూ వస్తూ ఎప్పటిలాగే భయంకరమైన ఎండలను తీసుకొచ్చింది. అయితే ఇంట్లో ఉన్నా వడదెబ్బ తగులుతోందని.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తరచూ కొబ్బరినీళ్లు, మజ్జిగ, ఉప్పు వేసిన నిమ్మరసం, గ్లూకోజ్ వాటర్ వంటివి తాగాలి. దాహం కావట్లేదని నీళ్లు తాగకుండా ఉండొద్దు. ఫ్రై చేసిన ఫుడ్ తినొద్దు. డ్రగ్స్, ఆల్కహాల్, స్మోకింగ్ తీసుకొవద్దు.