W.G: తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ని నందమూరు గ్రామ రైతులు శుక్రవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసారు. ఆరుళ్ళ బ్రిడ్జికి అప్రోచ్ రోడ్డు కొత్తగా వేయడం వలన ఎర్రకాలవ అవతల పొలాలకు వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉందనీ రైతులు వివరించారు. వెంటనే స్పందించిన ఆయన ఆర్అండ్బి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.