AP: రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి. కర్నూలులో అత్యధికంగా 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాలలో 41.2, కడపలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దీంతో సామాన్య ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.