WGL: రాయపర్తి మండలం ఏకే తండాలో యువతిపై జరిగిన అత్యాచార ఘటనపై రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షుడు సురేందర్ రాథోడ్ స్పందించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ప్రేమ పేరుతో వంచన చేసి గ్యాంగ్ అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని, అవసరమైతే ఉరిశిక్ష విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.