ఖమ్మంలో శుక్రవారం జరిగిన సీపీఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ప్రసంగించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, సామాన్యుల హక్కుల కోసం ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులకు మద్దతు ధర, నిరుద్యోగ నిర్మూలనపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.